Saturday, 21 July 2018

Weightlifting News


తేజావత్ సుకన్య నాయక్  మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ జాగ్యా తాండలో 15-12-1995 లో లక్ష్మణ్ మరియు బద్రి ల మూడవ సంతానంగా జన్మించినది . ముగ్గురు ఆడపిల్లలు కావడంతో ఆఖరి అమ్మాయిని తనకు ఇష్టం అయిన క్రీడలలో ప్రోత్సహించారు .

2014 లో వెయిట్ లిఫ్టింగ్ లో జాయిన్ అయ్యాను . డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ లో మెడల్ రావడంతో ఉత్సాహం  పెరిగింది . 2016 మే వరకు ప్రాక్టీసు బాగానే జరిగింది కానీ కోచ్ తెలంగాణ నుండి ఆంధ్రాకు ట్రాన్సఫర్ అవడంతో ప్రాక్టీస్ సరిగా జరగడం లేదు . కోచ్ ని కలిస్తే విజయవాడ
V.K అకాడమీ కి రావలిసిందిగా చెప్పారు . నాన్నగారు సరే అనడంతో విజయవాడ V.Kఅకాడమీ లో కోచ్ వి. ఎన్ . రాజశేఖర్ దగ్గర జాయిన్ అయ్యాను .
గత సంవత్సరము జరిగిన  14th ఇంటర్నేషనల్ ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్ లో 6th ప్లేస్ సాధించాను .
 ఈ నెల మే 10 నుండి 13వరకు స్పెయిన్ లోని తేనెరీఫ్ లో జరిగిన 15 ఇంటర్నేషనల్ ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్ లో 90kg  విభాగంలో 2nd place (సిల్వర్ medal ) సాధించాను . 
స్స్నాచ్ లో 75కేజీలు  + క్లీన్ & జెర్క్ లో 85కేజీలు =మొత్తం 160 కేజీలు 

 నన్ను ఎప్పుడు ప్రోత్సహించే తల్లితండ్రులు  మా తాతగారు తేజావత్ రామచంద్రు నాయక్ గారు   మా కోచ్ రాజశేఖర్ ఆశీస్సులతో తప్పక అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానని ఆశిస్తున్నాను .
నన్నుఎప్పుడు ప్రోత్సహించే Electronic & Print Media కు   నా ధన్యవాదాలు తెలియచేస్తూ నన్నుఎప్పుడు ఇలాగే ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను .
నాకు ఎవరయినా స్పాన్సర్స్ ముందుకు వచ్చి ప్రోత్సహిస్తే తప్పక అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం పేరు మరియు  స్పాన్సర్స్ పేరు  నిలబెడతానని తెలియ చేస్తున్నాను .
 V N Raja Sekhar,
National Weightlifting Coach
Cell no 888 557 9707, Email : raj1269@gmail.com